అం ఆద్మీ పార్టీ వ్యూహం చక్కగా ఫలించింద..?

ఇల్లు అలక గానే పండుగ కాదు అని ఒక సామెత. అం ఆద్మీ పార్టీకి ఇది చక్కగా వర్తిస్తుంది
- Pasam Jagannadham Naidu

డిల్లీలో అం ఆద్మీ పార్టీ వ్యూహం చక్కగా ఫలించింది రాష్ట్రంలో మాత్రం అడుగడుగునా వైఫల్యం చెందింది.డిల్లీలో అం ఆద్మీ వేసిన ప్రతి అడుగు విజయవంతం అయింది.రాష్ట్రంలో మూడు అడుగులు ముందుకు వేస్తె ఆరు అడుగులు వెనక్కు జరిగింది.డిల్లీలో .మీడియా పెద్దగా మొదట్లో అం ఆద్మీకి పెద్దగా ప్రచారం ఇవ్వకపోయినా పేస్ బుక్ లో ఎప్పటికప్పుడు ఆ పార్టీ వేసే ప్రతి అడుగు విజయాన్నీ సూచించింది. ప్రజలను విశేషంగా ఆకర్షించింది.

దేశ రాజధాని డిల్లీ నగరం సమస్యలు,అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు,అందుకు పరిష్కార మార్గాలు రాజకీయ వ్యూహాలు రచించడంలో కేజ్రీవాల్ ఆలోచనలు చక్కగా ఫలించాయి. డిల్లీలో అం ఆద్మీ పార్టీ అంచనాలు, ప్రజల ఆలోచననలకు అనుగుణంగా నడుచుకోవడంలో వారి అభిమానాన్ని పొందడంలో ఆ పార్టీ విజయవంతం అయింది. రాష్ట్రంలో మాత్రం తీవ్ర వైఫల్యాలను మూట గట్టుకుంది.

పెళ్ళికి ఒక మేళం తాళం ఉంటుంది. పుట్టిన రోజు పండుకకు మరో రకమైన ఏర్పాట్లు ఉంటాయి. డిల్లీ సమస్యలు వేరు. దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పరిస్తితులు సమస్యలు వేరు. డిల్లీ రాజకీయ ప్రణాళిక, అక్కడి వ్యూహం వేరు, ఆంధ్రప్రదేశ్ కు కావలసిన రాజకీయ ప్రణాళిక వ్యూహం వేరు. అక్కడి లాగే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అనుకరిస్తే విఫలం కావడం తద్యం. రాష్ట్రంలో అదే జరిగింది.

అం ఆద్మీ నాయకత్వం ఆంధ్ర ప్రదేశ్ పరిస్తితి గురించి తెలుసుకోకుండా ఇక్కడి పరిస్తితులపై సరి అయిన అధ్యయనం చేయకుండా ఇక్కడి పరిస్తితులకు భిన్నమైన వ్యూహాలను రచించి రాష్ట్రంలో పార్టీ నిర్మాణం విషయంలో చతికిలబడింది. రాజకీయ. వ్యూహం రచించడంలో లోకసత్తా పార్టీకి, అం ఆద్మీకి పెద్ద తేడా లేనట్టు, అభాసు పాలయింది.

ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ప్రజల అభిమానాన్నిపొండడంలోను,, వారి పట్టును నిలుపుకోవడంలోఘోర వైఫల్యం చెందిన పరిస్తితులలో ఉన్నాయి. అన్ని పార్టీలు అవినీతిలో అందే వేసిన ముద్రను సంపాదించి ఉన్నాయి. ఇక్కడ నూటికి 70 మంది ప్రజలు రాష్ట్రంలోని అన్ని పార్టీలను వ్యతిరేకిస్తున్నట్టు ఇటీవల ఒక సర్వే నిగ్గుదేల్చిం ది.

అలాంటి స్తితిలో ఇక్కడి పరిస్తితులకు అనుగుణంగా వ్యవహరిమ్చాడంలోను సమర్ధ నాయకత్వాన్ని గుర్తించి పార్టీ బాధ్యతలు అప్పగించడంలో విఫలం అయింది. లేదంటే ఇక్కడ ఈ పాటికి రాష్ట్రంలో అం ఆద్మీ పార్టీకి ఎక్కడ లేని స్పందన, ఆదరణ లభించి ఉండేది. 2014 ఎన్నికలలో అం ఆద్మీ కి ఎంతో ఊపును. ఆదరణను ఇక్కడి ప్రజలు కల్పించి ఉండే వారు.



0 comments:

Trendy LIST